Tag Archives: collector jitesh v.patil

పారిశుద్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలి

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు రెండు వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై …

Read More »

రోడ్లు తక్షణమే మరమ్మతు చేయించాలి

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీ వీల్‌ ట్రాక్టర్లు రోడ్లపై నడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి …

Read More »

కట్ట మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలి

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు …

Read More »

వ్యాధిగ్రస్థుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధ్యమైనంత త్వరగా టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ, కుష్టు, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ సిబ్బంది, లెప్రసి ఎడ్యుకేషన్‌, ఎన్జీవోల జిల్లా సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణ ఓపి ద్వారా క్షయ వ్యాధిగ్రస్థుల గుర్తింపు …

Read More »

ఆగష్టు 1 నుండి పరీక్షలు… ఏర్పాట్లు పూర్తిచేయాలి…

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు …

Read More »

అర్హత గల వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల జంటలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని కోరారు. కాన్పుల మధ్య …

Read More »

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్‌ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం …

Read More »

రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయిల్‌ ఫామ్‌ సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బిందు, తుంపర్ల సేద్యం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని రైతు వేదికలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ తో పాటు రైతులకు అదనపు ఆదాయం …

Read More »

అలుగుల వద్దకు ప్రజలెవరు రావద్దు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును బుధవారం పరిశీలించారు. తూము వద్ద ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదల అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »