Tag Archives: collector jitesh v.patil

కలెక్టర్‌గా ఏడాది పూర్తి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, టిఎన్‌జిఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి, …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వ నిధి సే సమృద్ధిలో భాగంగా వీధి వ్యాపారులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అర్హతగల వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన, జీవన్‌ …

Read More »

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర …

Read More »

సోమవారం ప్రజావాణి ఉంది

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయ వచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, రోడ్లు, మునిసిపల్‌, గ్రామపంచాయతీ, ఆర్టీసీ, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలపై ఫిర్యాదులు …

Read More »

క్రీడలతో స్నేహ భావం పెరుగుతుంది

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద కొడప్గల్‌ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయని చెప్పారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని సూచించారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహ భావం పెరుగుతోందని పేర్కొన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతమైందని …

Read More »

జిల్లా కలెక్టర్‌ శ్రమదానం

కామరెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదవ విడత పల్లె ప్రగతి లో 10,743 కిలోమీటర్ల పొడవు రోడ్లు శుభ్రపరిచారు. మురుగు కాలువలు 1338 కిలోమీటర్ల పొడవు పూడిక మట్టిని తొలగించి శుభ్రం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. 526 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 60,790 మంది ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 2999 …

Read More »

పౌష్టికాహారం అందేలా చూడాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి కేంద్రాలలో పౌష్టికాహార లోపం లేని చిన్నారులు ఉన్న జిల్లాగా గుర్తింపు తీసుకురావడానికి ఐసిడిఎస్‌, పోషణ అభియాన్‌ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం పర్యవేక్షణతో కూడిన అనుబంధ కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంగన్‌వాడి …

Read More »

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసే విధంగా మెప్మా రిసోర్స్‌ పర్సన్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని …

Read More »

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More »

గురుకుల పాఠశాల తనిఖీ

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు వివరాలను ప్రిన్సిపల్‌ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »