Tag Archives: collector jitesh v.patil

ఒకేపోలింగ్‌ కేంద్రంలో కుటుంబం మొత్తం పేర్లు ఉండేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితాలో ఉన్న మృతిచెందిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఈనెల 25లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఒక కుటుంబం మొత్తం పేర్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేవిధంగా చూడాలన్నారు. ఓటర్‌ల …

Read More »

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్‌, థైరాయిడ్‌, డయాలసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు. వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిప్రియ రైస్‌ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి …

Read More »

ధరణి దరఖాస్తులు పెండిరగ్‌ లేకుండా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పెండిరగ్‌ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. ఎల్లారెడ్డి తహసిల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ధరణి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పాసుపుస్తకం నకలు పొందవచ్చని సూచించారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఇంచార్జ్‌ ఆర్డీవో రాజా గౌడ్‌, తాసిల్దార్‌ స్వామి ఉన్నారు.

Read More »

స్లాట్‌ బుకింగ్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఎంపీడీవో రాజ్‌వీర్‌ మాట్లాడారు. ఉపాధి హామీ సోషల్‌ ఆడిట్‌ 18 గ్రామాలు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 గ్రామాల ఆడిట్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనుల వర్క్‌ ఫైళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ …

Read More »

రోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలోని పద్మావతి రైస్‌ మిల్లు ను మంగళవారం సందర్శించారు. సకాలంలో మిల్లింగ్‌ పూర్తిచేయాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జ్‌ డిఎస్‌ఓ రాజశేఖర్‌, సివిల్‌ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తహసిల్దార్‌ కిష్టయ్య, రైస్‌ మిల్‌ …

Read More »

వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని కోరారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు …

Read More »

నిజాంసాగర్‌ మండలంలో 1800 మంది దళిత బంధు పథకానికి ఎంపిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో 1800 మంది లబ్ధిదారులను దళిత బంధు పథకానికి అర్హులుగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బందు పథకంపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు తీసుకున్న నగదును ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. చిన్న పరిశ్రమలు, వివిధ రకాల …

Read More »

ప్రజావాణి వినతులు వారం రోజుల్లో పరిష్కరించాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో ప్రజలు విన్నవించిన సమస్యలను వారం రోజుల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ …

Read More »

రోజువారి లక్ష్యాలు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో టెలీ కాన్పరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఆరోగ్య కార్యకర్త వందమందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేసే విధంగా చూడాలన్నారు. 100 శాతం ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేసిన …

Read More »

జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం 765డి మెదక్‌ నుంచి రుద్రూర్‌ వరకు చేపడుతున్న జాతీయ రహదారి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ, రెవిన్యూ, మిషన్‌ భగీరథ, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »