కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బి ప్రోగ్రాం కొరకు 2022Ê23 ఎంపిసి / ఎంఇసి లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అర్హత పదో …
Read More »వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన …
Read More »ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దేమి కాలన్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా …
Read More »జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం మరువలేనిది
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన సందర్భంగా జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిది కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డికి నిజామాబాద్ లో పాలనాధికారిగా విధులు నిర్వహించి, వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, …
Read More »కంటి వెలుగు శిబిరాల నిర్వహణ భేష్
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చక్కటి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, కంటి వెలుగు శిబిరాలు ముగిసేంత వరకు కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం సాయంత్రం …
Read More »వారం రోజుల్లోపు పోడు భూముల ప్రక్రియను పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్‌లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పోడు భూములకు …
Read More »పోడు పట్టాలను సిద్ధం చేయండి
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన తుది దశ ప్రక్రియలను తక్షణమే పూర్తి చేయాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలను సిద్ధం చేసుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. సోమవారం …
Read More »వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద …
Read More »సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ …
Read More »