నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్ షిప్ ను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ టౌన్ షిప్‌లో ప్లాట్లను విక్రయించేందుకు నవంబర్ 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో టౌన్ షిప్ వద్ద కొనసాగుతున్న …
Read More »జాతీయ స్థాయి అవార్డులకు జీ.పీలు కృషి చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుల కోసం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నందున, జిల్లాలోని మొత్తం 530 జీ.పీలు నామినేషన్ చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయి అవార్డుల కోసం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లోనూ …
Read More »జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (న్యూ కలేక్టరేట్) గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో శాఖ వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్న సుధీర్ కుమార్ అనే ఉద్యోగి అనధికారికంగా విధులకు గైరుహాజరు కావడాన్ని …
Read More »డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంట క్షేత్రాన్ని కలెక్టర్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పండిరచడంలో పాటిస్తున్న …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సైతం పరీక్షా కేంద్రాలను సందర్శించారు.జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలోని రెండు ఎగ్జామ్ సెంటర్లను, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …
Read More »విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా గల అన్ని గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయాలు ఉత్తర తెలంగాణ …
Read More »మన ఊరు-మన బడి పనులు వారంలో పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులకు ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా జరిపించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. మొదటి విడతగా జిల్లాలో మంజూరీ తెలిపిన మొత్తం114 పాఠశాలల్లోనూ వారం రోజుల్లోపు పనులన్నీ పూర్తి కావాలని స్పష్టమైన గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »ముందస్తుగా నిర్వహించే సిజీరియన్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలకు పూర్తి నెలలు నిండకముందే పలు ఆసుపత్రుల్లో ముందస్తుగానే సిజీరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు నిర్వహిస్తున్న అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టిని కేంద్రీకరించింది. వాస్తవంగానే అత్యవసర పరిస్థితుల్లో ముందస్తుగా సిజీరియన్లు చేస్తున్నారా, లేక అవసరం లేకపోయినా ఇతరత్రా కారణాల వల్ల ఇలా వ్యవహరిస్తున్నారా అన్నది నిర్ధారించేందుకు కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులు, గైనకాలజిస్టులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. …
Read More »వేలం వేయనున్న ప్లాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన వేలంపాట ద్వారా విక్రయించనున్న ప్రభుత్వ నివేశన స్థలాలను శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించి క్షేత్రస్థాయిలో స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. వచ్చే నెల 14 వ తేదీన వేలంపాట నిర్వహించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే డీటీసీపీ …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల …
Read More »