Tag Archives: collector narayana reddy

అక్రిడిటేషన్‌ కార్డులు అందజేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడిటేషన్‌ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తన ఛాంబర్లో అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులకు అందజేశారు. మొదటి విడతగా 470 అక్రిడిటేషన్‌ కార్డులను మంజూరు చేసినట్లు కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.పద్మశ్రీ, కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఏ.నర్సింలు, జూపల్లి రమేష్‌, …

Read More »

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్‌ బారిన పడకుండా వ్యాక్సిన్లు తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో కోవిడ్‌ నియంత్రణ, సీజనల్‌ వ్యాధుల నిర్మూలన, హరితహారం, సంక్షేమ వసతి …

Read More »

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలివితేటలు ఏ ఒక్కరికో సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన …

Read More »

ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులకు ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ తరగతుల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌ తో …

Read More »

నేటి నుండి ఇంటింటి సర్వే

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా జిల్లాలో నేటి (బుధవారం) నుండి ఇంటింటి సర్వే చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దాదాపు గడిచిన మూడు వారాల నుండి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నందున …

Read More »

సీజనల్‌ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వసతి గృహాల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు రక్షిత మంచినీటి సరఫరా …

Read More »

అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు హాజరయ్యారు. ఈ …

Read More »

బాధితులకు సత్వరమే పరిహారం అందేలా చొరవ చూపాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలు నివాస గృహాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వపరంగా సత్వరమే నష్టపరిహారం అందేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. నిర్విరామంగా వారం రోజుల పాటు కురిసిన …

Read More »

కలెక్టరేట్‌లో ఘనంగా బోనాలు పండుగ

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగుల జెఏసి జిల్లా చైర్మన్‌ అలుక కిషన్‌ నేతృత్వంలో నిర్వహించిన ఉత్సవాల్లో నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో పాటు …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌ రాయ్‌ నేతృత్వంలో దీప్‌ శేఖర్‌ సింఘాల్‌, కృష్ణ ప్రసాద్‌ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »