Tag Archives: collector narayana reddy

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో …

Read More »

ప్రయివేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకుంటూ అభినందించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏమాత్రం తీసిపోవని నిరూపితమైందని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ …

Read More »

ప్రజావాణి ప్రాముఖ్యతను గుర్తెరిగి పనిచేయాలి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రామానికి గల ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు హితవు పలికారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా …

Read More »

పకడ్బందీగా ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకునే వయస్సు కలిగి ఉన్న బాలలను పనులలో కొనసాగించడం నేరమని, అలాంటి బాలలను గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయా …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు …

Read More »

జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఇందల్వాయి మండలం చంద్రాయన్‌ పల్లి నుండి మొదలుకుని బాల్కొండ మండలం పోచంపాడ్‌ వరకు 44వ నెంబర్‌ జాతీయ రహదారి పొడుగునా హరితహారం మొక్కలను పరిశీలించారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి, చంద్రాయన్‌పల్లి, …

Read More »

ప్రతి జీ.పీ పరిధిలో పంచ వనాలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పంచ వనాలు ఏర్పాటు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి జీ.పీ పరిధిలో ఐదు రకాలకు చెందిన కనీసం వెయ్యి మొక్కలను నాటి పంచ వనాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. …

Read More »

కలెక్టరేట్లో ఘనంగా గణాంక దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో బుధవారం గణాంక దినోత్సవ (స్టాటిస్టిక్స్‌ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. గణాంక పితామహుడు పీసీ.మహలనోబిస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎలాంటి ప్రణాళిక …

Read More »

జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం (డీఎంఏసి) బుధవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగింది. ఆయా ప్రింట్‌ / ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలలో పని చేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు 2022 -2024 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడిటేషన్‌ కార్డుల విషయమై సమావేశంలో కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన మీదట …

Read More »

అటెండెన్స్‌ యాప్‌ ఆధారంగానే జీతాల చెల్లింపు

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్యారోగ్య శాఖలో జిల్లా స్థాయి అధికారి మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఉద్యోగికి అటెండెన్స్‌ యాప్‌ ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు భిన్నంగా ఎవరికైనా జీతాలు మంజూరు చేస్తే, సంబంధిత డీ.డీ.ఓల నుండి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »