Breaking News

Tag Archives: collector narayana reddy

హరితహారానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఆశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమై హరితహారం అమలుపై దిశా నిర్దేశం చేశారు. రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురియనున్న దృష్ట్యా …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …

Read More »

జిల్లా జనరల్‌ ఆసుపత్రి తనిఖీ, కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ జిల్లా జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ నెల 18న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు జిల్లా పర్యటనకు హాజరవుతున్న సందర్భంగా జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో వృద్ధుల కోసం సుమారు 50 లక్షల రూపాయలను వెచ్చిస్తూ నూతనంగా నెలకొల్పిన ‘ఆలన’ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే స్కిల్‌ …

Read More »

లక్ష్యానికి మించి పంట రుణాలు అందించాలి

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు హితవు పలికారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. గత ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన …

Read More »

పేషంట్‌ వెంట ఒక్క అటెండెంట్‌నే అనుమతించాలి

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌ పేషంట్‌ల వెంట ఒక అటెండెంట్‌ ను మాత్రమే అనుమతించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్‌ సమీక్ష జరిపారు. ఎక్కువ సంఖ్యలో సహాయకులు ఉండడం వల్ల ఇతర అనేక రకాల ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్నందున ఈ …

Read More »

ఋణ విస్తరణలో లోన్లు మంజూరు చేశారు

నిజామాబాద్‌, జూన్ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో వినాయక్‌ నగర్‌ బస్వా గార్డెన్‌లో ఋణ విస్తరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని బ్యాంకులు కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల బిజినెస్‌ లోన్‌, వ్యవసాయ రుణాలు, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ లకు గృహ, కార్‌ లోన్లు మంజూరు చేశారు. లీడ్‌ బ్యాంకు అధికారి ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో …

Read More »

మన ఊరు – మన బడి అమలులో నిజామాబాదు జిల్లా ఆదర్శం

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలులో నిజామాబాద్‌ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక …

Read More »

‘కంటి వెలుగు’లో భాగంగా కాటరాక్టు ఆపరేషన్లు చేపట్టాలి

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంపిక చేసిన వారికి కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన వైద్యారోగ్య శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …

Read More »

కంజరలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశమ్మ వాగుకు ఆనుకుని వైకుంఠధామం వద్ద ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వాగు ద్వారా వచ్చే వరద జలాలను నిలువరించేందుకు వీలుగా పకడ్బందీ పనులు జరిపించాలని …

Read More »

టూరిజం స్పాట్‌గా ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ఏరియా

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమై పై అంశం పై చర్చించారు. టూరిజం అభివృద్ధి సంస్థతో పాటు, అటవీ అభివృద్ధి సంస్థ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »