నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రమైన నవీపేట్ తో పాటు అదే మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి …
Read More »’కంటి వెలుగు’ మానవత్వంతో కూడిన కార్యక్రమం
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్‌లో గల స్త్రీ స్వశక్తి భవన్‌లో మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించనున్న మంత్రి
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ఈ నెల 19న (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ హౌసింగ్ బోర్డు కార్యాలయం సమీపంలో గల స్త్రీ శక్తి భవన్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ …
Read More »కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి …
Read More »ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. …
Read More »క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి సౌత్ జోన్ సీనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో అభిలాష్ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని మహిళా భవనంలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. …
Read More »ప్రవేశ పరీక్ష గోడప్రతుల ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష టీజీయూజీ సెట్ – 2023 ను పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టీజీయూజీ సెట్ – 2023 ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన వారు ఫిబ్రవరి …
Read More »ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుది దశ …
Read More »సిద్దులగుట్ట అభివృద్ధికి విస్తృత అవకాశాలు
ఆర్మూర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సిద్దుల గుట్ట వద్ద …
Read More »