నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 85 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏ.ఓ సుదర్శన్‌లకు …
Read More »లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలి
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గట్టి నమ్మకంతో పూర్తి సిలబస్ చదవాలని. కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా భావించి ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు …
Read More »కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, పంచాయతీ కార్యదర్శికి మెమో
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె / పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైకుంఠధామం వద్ద జరుగుతున్న పనుల తీరును పరిశీలించి, విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, …
Read More »ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా పల్లె, పట్టణ ప్రగతి సాగాలి
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే దిశగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ముగిసేంతవరకు పక్షం రోజులపాటు అధికారులందరూ వారికి కేటాయించిన కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్యపరమైన సమస్యలను మినహాయిస్తే ఇతర కారణాలతో ఎవరికీ సెలవులు మంజూరు చేయకూడదని స్పష్టమైన …
Read More »పల్లె ప్రగతి ముగిసేనాటికి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ 3 వ తేదీ నుండి రెండు వారాల పాటు కొనసాగనున్న పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసేనాటికి నిర్దేశిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైకుంఠధామాలలో తప్పనిసరిగా నీటి వసతి, …
Read More »రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం
బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో …
Read More »పనితీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలు
నిజామాబాద్, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకుని నాణ్యమైన సేవలందిస్తే వైద్య శాఖకు మంచి పేరు వస్తుందని, నూటికి నూరు శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హితవు పలికారు. పనితీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. …
Read More »పరిపూర్ణ లక్ష్య సాధన దిశగా పల్లె ప్రగతి అమలు
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ 3 నుండి 17వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ప్రగతి …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల …
Read More »పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత …
Read More »