నిజామాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్) కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. సముదాయంలోని పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గేటు నుండి కార్యాలయాల వరకు గల ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి పూల చెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సముదాయం ప్రాగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపించాలని, ఖాళీ …
Read More »ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు అనుమతించకూడదు
నిజామాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వ్వాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షల …
Read More »హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలి
నిజామాబాద్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో మున్సిపల్, నీటి పారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు …
Read More »‘పది’ పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో చీఫ్ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సి పరీక్షలపై …
Read More »అత్యధిక కొలువులు సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరపజేయాలి
నిజామాబాద్, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్‌లు వెలువరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీ, యువకులు అధిక సంఖ్యలో ఉద్యోగాలను సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరప చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాలు, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో …
Read More »ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఇంటర్ పరీక్షలలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,961 మంది విద్యార్థులకు గాను 16,182 మంది విద్యార్థులు హాజరుకాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ …
Read More »పనితీరు మెరుగుపర్చుకోకుంటే కఠిన చర్యలు
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీహెచ్‌సిల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్ తదితర …
Read More »మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ, సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి హాస్టల్ …
Read More »ఫ్రీ కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ ఎగ్జామ్స్‌తో పాటు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వరంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్ మెరిట్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు …
Read More »లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ రెండవ వారం నుండి చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయత్తం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో …
Read More »