Tag Archives: collector narayana reddy

జిల్లా అధికారులకు కలెక్టర్‌ హెచ్చరిక

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధుల పట్ల అలసత్వ వైఖరి ప్రదర్శించే వారిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అవసరమైతే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. ప్రత్యేకించి నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కరాఖండీగా తేల్చి చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ఆయా …

Read More »

పక్షం రోజుల్లోపు పనులు ప్రారంభించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అవసరమైన పనులను గుర్తిస్తూ, పక్షం రోజుల్లోపు అవి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానీయ సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, విద్యా శాఖ, …

Read More »

ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యా బోధన

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత మెరుగైన విద్యా బోధన జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. ప్రభుత్వ బడులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల వసతులతో ఆకట్టుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు మరింత …

Read More »

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చేపడుతున్న పనులలో రాజీ ధోరణికి తావు కల్పించకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ చేపడుతున్న ఈ పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతా లోపాలకు ఆస్కారం లేకుండా …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌లకు విన్నవిస్తూ అర్జీలు …

Read More »

డ్రోన్‌ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్రోన్‌ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను కూలంకషంగా పరిశీలన జరిపిన తరువాతనే యూనిట్ల స్థాపన కోసం ముందుకెళ్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా అభ్యున్నతి బాటలో పయనింపజేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్న విషయం విధితమే. ఈ పథకం మొదటి విడతలో …

Read More »

హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌ రెడ్డి శనివారం నిజామాబాద్‌ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌ రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హోళీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, అభివృద్ధి పథాన అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read More »

పాఠశాలలను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అర్సపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడత కింద ఎంపికైన వాటిలో ఈ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో …

Read More »

దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు యూనిట్ల ఎంపికతో పాటు వాటిని తమకు నచ్చిన చోట స్థాపించుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారులకు ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆంక్షలు, పరిమితులు ఉండవన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో బుధవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఏర్పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »