Tag Archives: collector narayana reddy

దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పధకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్‌ మొదటి వారం నుండి యూనిట్ల స్థాపన కోసం లబ్దిదారులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్‌ మంగళవారం బోధన్‌ శాసనసభా నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం …

Read More »

మన ఊరు – మన బడి పనుల అంచనాలను తక్షణమే రూపొందించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నాటికి ఒక్కో అధికారి కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన పనుల అంచనాలను రూపొందించి సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పించాలని …

Read More »

ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధనతో అద్భుతాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం అవుతున్నాయని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కారీ బడులకు మహర్దశ కల్పిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చక్కటి బాటలు వేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు …

Read More »

నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల ఖరారు

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఈ నెలాఖరులోగా వారు ఎంచుకున్న యూనిట్లను అధికారికంగా కేటాయిస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఖరారైన యూనిట్లను ఏప్రిల్‌ మొదటి వారం నుండి స్థాపించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్‌ శుక్రవారం డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామంలో దళితబంధు …

Read More »

ఈ-నామినేషన్‌ నమోదు ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల భవిష్య నిధి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ-నామినేషన్‌ నమోదు ప్రక్రియను ప్రైవేట్‌ సంస్థల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు ఈ-నామినేషన్‌ నమోదు కోసం గురువారం సాయంత్రం నాగారం శివారులోని దేశాయి బీడీ కంపెనీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో …

Read More »

దళితబంధుతో కుటుంబ స్థితిగతులు మెరుగుపడాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ స్థితిగతులను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. అట్టడుగున ఉన్న తమ వంశాన్ని ఉన్నత స్థితికి చేర్చాలనే కసితో కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించగల్గుతారని అన్నారు. తద్వారా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ అభిమతం నెరవేరుతుందని, దళితబంధు పథకానికి …

Read More »

దళితబంధు లబ్ధిదారులు ఆదర్శంగా నిలవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులు నిర్దేశిత లక్ష్యాలకు చేరుకుని ఇతర లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. యూనిట్ల స్థాపనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, కొంత ఆలస్యం అయినప్పటికీ పూర్తి అవగాహనతో యూనిట్లను ఏర్పాటు చేసుకుని కష్టపడితే …

Read More »

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల …

Read More »

ప్రభుత్వ బడుల్లో అవసరం ఉన్న పనులనే చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మన ఊరు – మన బడి, హరితహారం, దళిత బంధు, ఉపాధి హామీ అమలు తీరుపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »