Tag Archives: collector narayana reddy

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిశీలన జరుపుతూ ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 63 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల …

Read More »

చిన్నారుల భవిష్యత్తు కోసం చుక్కల మందు వేయించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారులకు ఆరోగ్యవంతమైన చక్కటి భవిష్యత్తును అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కలెక్టర్‌ ఆదివారం చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పల్స్‌ పోలియోను …

Read More »

ధరణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు రెవిన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో ధరణి కార్యక్రమంపై ఆర్దీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పెండిరగ్‌ ధరణి దరఖాస్తుల గురించి ప్రస్తావిస్తూ, …

Read More »

గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు టిఎస్‌ఐసి ఆర్థిక సహకారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్స్‌ ఫర్‌ రూరల్‌ ఇంపాక్ట్‌ ఇన్సెంటివ్స్‌ (టిఎస్‌ఐఆర్‌ఐఐ) ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు మద్దతుగా …

Read More »

పకడ్బందీగా మన ఊరు – మన బడి అమలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి/మన బస్తీ – మన బడి కార్యక్రమం విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌లో మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్‌, విద్యా …

Read More »

సోమవారం లోపు ప్రారంభం కాని ఉపాధి హామీ పనులు రద్దు చేస్తాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత సిసి రోడ్లు, సి.సి డ్రైనేజీల నిర్మాణం పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సోమవారం లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తేల్చి చెప్పారు. లేనిపక్షంలో సంబంధిత పనులను రద్దు చేసి, అదే నియోజకవర్గంలోని ఇతర గ్రామ పంచాయతీలకు కేటాయిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తమకు పూర్తి …

Read More »

శ్రమను ఆయుధంగా మలచుకుంటే లక్ష్యం సిద్ధిస్తుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రమను ఆయుధంగా మల్చుకుని అకుంఠిత దీక్షతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. అంతంతమాత్రంగానే సదుపాయాలూ అందుబాటులో ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పేద కుటుంబాలకు చెందిన వారికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధమని ఆయన పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా …

Read More »

అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌ లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ …

Read More »

పంట రుణాల పంపిణీలో అలసత్వం తగదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున సేద్యపు రంగానికి విరివిగా రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాల పంపిణీలో ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని అన్నారు. స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా …

Read More »

పల్స్‌ పోలియో విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో మహమ్మారిని నిర్మూలించడం కోసం చేపట్టనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుండి వరుసగా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పల్స్‌ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ప్రగతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »