నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని వైద్యాధికారుల వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నవంబర్ మాసంలో జిల్లాలో మొత్తం 2784 కాన్పులు జరుగగా, అందులో 57 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, …
Read More »పారిశుద్ధ్యం, హరితహారం నిర్వహణ మరింత మెరుగుపడాలి
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్, హరితహారం నిర్వహణను మరింతగా మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అంశంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా హరితహారం కింద …
Read More »పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి, దూస్‌గాం గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను …
Read More »జిల్లా కలెక్టర్‌ను కలిసిన బిజెపి నేతలు
నిజామాబాద్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాత కలెక్టరేట్ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని (కలెక్టర్ గ్రౌండ్) క్రీడా ప్రాంగణానికి కేటాయించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ ఎంఆర్‌వో కార్యాలయ స్థలాన్ని వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ …
Read More »పలువురు అధికారులకు మెమోలు జారీ
నిజామాబాద్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి పనులను సకాలంలో పూర్తి చేయించడంలో అలసత్వం కనబర్చిన అధికారులపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, వెంటదివెంట బిల్లులు మంజూరు చేస్తున్నప్పటికీ నిర్ణీత గడువు లోపు ఎందుకు పనులను పూర్తి చేయడం …
Read More »లక్ష్య సాధన దిశగా అంకిత భావంతో కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంట సాగుపై సమీక్ష జరిపారు. జిల్లాలో …
Read More »పనుల్లో పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు
నిజామాబాద్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఖలీల్వాడిలో నూతనంగా నిర్మించతలపెట్టిన వెజ్-నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని, అహ్మదీ బజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని …
Read More »26 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 వ తేదీ నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8 వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి …
Read More »పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేష్ దత్ ఎక్కా సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఇందల్వాయి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను సందర్శించారు. …
Read More »నెలాఖరు నాటికి ఐ.టీ హబ్ పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐ.టీ హబ్ పనులను సోమవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టరుకు కీలక సూచనలు చేశారు. ఈ …
Read More »