నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు. …
Read More »ఇద్దరు పిల్లలను దత్తత ఇచ్చారు
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇద్దరు పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శిశు గృహలో వసతి పొందుతున్న ఆరు నెలల వయసు గల ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు, విజయవాడకు చెందిన తల్లిదండ్రులకు దత్తత ఇచ్చారు. పిల్లలు లేని వారు దత్తత తీసుకొనే అవకాశం ప్రభుత్వం …
Read More »ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాల్లో సముచిత ప్రాధాన్యత
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత లభించేలా చొరవ చూపాలని జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పించారు. ఉద్యోగ …
Read More »దత్తత ప్రక్రియ వేగవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శలకు అనుగుణంగా దత్తత తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దత్తత మాసం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తతను ప్రభుత్వ పరంగానే తీసుకోవాలని కోరారు. …
Read More »గడువులోపు నిర్మాణాలు పూర్తి కావాల్సిందే
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని …
Read More »నగర అభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ. 658.91 కోట్లు వెచ్చింపు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే, ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మూడిరతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నిజామాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి …
Read More »ధాన్యం బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »నగర సుందరీకరణపై సిఎం సమీక్ష
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు …
Read More »ఓటర్ల నమోదులో బీ.ఎల్.ఓల పాత్ర కీలకం
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ బూత్ వద్ద బీ.ఎల్.ఓలు నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్లను జాబితా నుండి …
Read More »పంట రుణాల పంపిణీలో ఉదాసీనత వీడాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. గత ఖరీఫ్, …
Read More »