నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల …
Read More »పాఠశాలల ఆకస్మిక తనిఖీ
నందిపేట్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా …
Read More »ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …
Read More »మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం …
Read More »దోన్పాల్‌లో సంక్షేమ పథకాల అమలును ప్రారంభించిన కలెక్టర్
మోర్తాడ్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన …
Read More »సంక్షేమ పథకాల అమలుకు నేడు అట్టహాసంగా శ్రీకారం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి శ్రీకారం చుట్టడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు .ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయం …
Read More »ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరు ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం …
Read More »వివరాలను వెంటదివెంట నమోదు చేయాలి
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలన తో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ …
Read More »అర్హుందరికీ లబ్ది చేకూర్చేందుకే ప్రజా పాలన గ్రామ సభలు
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి …
Read More »నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామ సభల నిర్వహణపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి …
Read More »