Tag Archives: collector rajivgandhi hanmanthu

పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి, కలెక్టర్‌

వేల్పూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తీవ్రతను పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వస్థలమైన వేల్పూర్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 139 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …

Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకం

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్‌ లో పాల్గొనాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ఓటింగ్‌ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్‌ …

Read More »

ఎన్నికలపై అవగాహన కోసం ప్రచార రథాలు

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో పాల్గొనాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార ప్రచార రథాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశామని ఈ …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల …

Read More »

ఐ.డీ.ఓ.సి లో మొక్కలు నాటిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం మొక్కలు నాటారు. కార్యాలయం ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అన్ని పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలింగ్‌ కేంద్రాల తుది …

Read More »

ఏకధాటి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడితో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని …

Read More »

దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »