నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద …
Read More »విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంపొందించేలా బోధించాలి..
రుద్రూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, …
Read More »29న బీసీ కమిషన్ బృందం రాక
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో చేపట్టబోయే కులాల గణన పై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ కు విచ్చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 29 న నిజామాబాద్ …
Read More »అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్
ఆర్మూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్ హౌస్‌లో మంత్రితో పాటు …
Read More »అన్ని హంగులతో అందుబాటులోకి ఏటీసీ కేంద్రాలు
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అధునాతన హంగులతో అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలు, శిక్షణా తరగతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు. ఏటీసీ లలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సత్వరమే ఉద్యోగ, ఉపాధి లభించేందుకు …
Read More »ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించగా, నగర మేయర్ నీతూకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు …
Read More »హిట్ అండ్ రన్ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా డివిజన్ల ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో గురువారం హిట్ అండ్ రన్ కేసుల …
Read More »ప్రజావాణికి 84 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ …
Read More »ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం …
Read More »