నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ, ప్రస్తుతం పంటల సాగు స్థితిగతులు, రబీలో …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఇటీవలే పూర్తయిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు …
Read More »కలెక్టర్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం సుదూర …
Read More »నిబంధనల అమలుపై నిశిత పరిశీలన
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే …
Read More »ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు నెలాఖరు వరకు గడువు
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీఓ నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు మీ సేవా ద్వారా దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల …
Read More »గొర్రెల పంపిణీ పథకం అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గొర్రెల పంపిణీ పథకం పై పలు సూచనలు చేశారు. ఇప్పటికే …
Read More »పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలతో …
Read More »ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ శివారులోని పాండు తర్ప వద్ద ప్రజాపయోగ అవసరాల నిమిత్తం ఇదివరకు ప్రభుత్వం సేకరించిన భూములను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ భూములకు సంబంధించిన వివరాల గురించి బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 67 ఎకరాల భూమిని ప్రభుత్వపరంగా సేకరించడం జరిగిందని తెలిపారు. రెండు పడక గదుల …
Read More »ప్రతీ వారం క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 110 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో …
Read More »