Tag Archives: collector rajivgandhi hanmanthu

రిజర్వాయర్‌ పనులను పరిశీలించిన స్పీకర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌ వద్ద సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్‌, కాలువల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పనులు కావడంతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి …

Read More »

అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సీజన్‌ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా …

Read More »

‘పోడు’ పాస్‌ బుక్కులను క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన క్లెయిమ్‌ల ప్రకారంగా రూపొందించిన పట్టా పాస్‌ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్‌ ఓ ఎఫ్‌ ఆర్‌ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని …

Read More »

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో ఉగాది పండగను జరుపుకోవాలని కోరారు. ప్రస్తుత శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు …

Read More »

నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని అభంగపట్నం, అబ్బాపూర్‌ గ్రామాలలో జీ.పీల ఆధ్వర్యంలో నెలకొల్పిన నర్సరీలను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. నవీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం స్కూళ్లలో మన ఊరు-మన బడి …

Read More »

ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఖలీల్‌ వాడిలో గల ఎస్‌.ఎస్‌.ఆర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్‌ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …

Read More »

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ …

Read More »

ప్రజావాణికి 69 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఆర్డీఓ చందర్‌, నిజామాబాదు ఆర్దీఓ …

Read More »

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »