నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే …
Read More »ప్రజల ప్రగతి కోసమే ప్రజా న్యాయపీఠాలు
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ సమాజంలో మానవ సంబందాలే ముఖ్యమని,కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపొచ్చాలు, పగలు, ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్ లో జాతీయ …
Read More »క్రిస్మస్ శుభాకాంక్షలు – కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.
Read More »అర్హులందరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన కోసం తోడ్పాటును అందించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని …
Read More »రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా …
Read More »కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు
నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసిఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్ పోలింగ్, పోలింగ్ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి ప్యాట్‌లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, …
Read More »ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్ శనివారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో కలిసి కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఆయా సెగ్మెంట్లలో కౌంటింగ్ కోసం …
Read More »కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్‌రూమ్ లకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలకు ఈవీఎంల తరలించగా, జాగ్రత్తగా వాటిని సరిచూసుకుని …
Read More »