నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ …
Read More »కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా గుర్తించబడిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ …
Read More »సాఫీగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్ …
Read More »పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల …
Read More »పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో పోలింగ్ అతి కీలకమైనందున ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో …
Read More »ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్ష జరిపారు. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకై రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ అజయ్ వి.నాయక్, ఐఏఎస్, రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, ఐపీఎస్ లు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)కు చేరుకోగా, జిల్లా ఎన్నికల అధికారి …
Read More »అబ్జర్వర్ల సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్ పూర్తి
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రాచక్రవర్తి, …
Read More »‘సువిధ’లో వచ్చే దరఖాస్తులను సకాలంలో అనుమతులు జారీ చేయాలి
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం సువిధ యాప్ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు సీ.ఈ.ఓ లోకేష్ సూచించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. సువిధ యాప్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిబంధనలకు …
Read More »ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో కలిసి కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు, భద్రపరచి ఉన్న ఇతర ఎన్నికల సామాగ్రి వివరాలతో కూడిన రికార్డులను తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని …
Read More »