నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఎన్నికల నిర్వహణ కోసం శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు రాండమైజేషన్ ద్వారా బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లను ఇటీవలే తరలించిన విషయం విదితమే. తరలింపు పూర్తయిన …
Read More »ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతో బాధ్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాల అధికారులకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శిక్షణ …
Read More »ఈవీఎంల తరలింపు పూర్తయింది
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియను శనివారం చేపట్టగా, ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, …
Read More »జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడు పై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం …
Read More »ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై శనివారం రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్ యాదవ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీ.ఈ.ఓ …
Read More »నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎం …
Read More »నిజామాబాద్‌లో మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియ పూర్తి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్ …
Read More »ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం బర్దీపూర్‌లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన …
Read More »ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 20 : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ తెరిపించి, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలలో వినియోగించాల్సి ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, …
Read More »పోలింగ్ విధులపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్ విధుల పట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రిసైడిరగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ చిన్న తప్పిదానికి సైతం …
Read More »