Tag Archives: dichpally

ఏప్రిల్‌ 3 నుంచి సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో సంప్రదించాలని కోరారు.

Read More »

రక్త మోడిన జాతీయ రహదారి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కంటైర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారి చంద్రాయన్‌ పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి నాగపూర్‌ వైపు వెళ్తున్న భారీ కంటైనర్‌ను వెనుక నుండి కారు ఢీకొన్నది. …

Read More »

తెయులో అంతర కళాశాలల చదరంగ పోటీలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటి అంతర కళాశాలల చదరంగ పోటీలు, ఎంపికలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో నిర్వహించినట్టు వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డా.టి. సంపత్‌ తెలిపారు. పోటీలు ప్రారంభ మరియు ముగింపు కార్య క్రమానికి ముఖ్యఅతిధిగా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌. ఆరతి హజరై …

Read More »

జి 20 జాతీయ సదస్సులో పాల్గొన్న గవర్నర్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం జరిగిన ‘ఇండియాస్‌’ జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చినిటీస్‌ అండ్‌ చాలెంజెస్‌ ఫర్‌ ఇండియా యాస్‌ ది గ్లోబల్‌ లీడర్‌’’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ మరియు పాండిచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదట ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ …

Read More »

పీకల్లోతు అవినీతిలో తెలంగాణ విశ్వవిద్యాలయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాలయం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ అన్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 150 మంది ఉద్యోగులను నియమించడం చట్ట విరుద్ధమని …

Read More »

హెల్త్‌ సెంటర్‌ను సందర్శించిన ఉన్నత విద్య మండలి చైర్మన్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్‌ సెంటర్‌ని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్‌ సెంటర్‌లో వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి …

Read More »

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మొదటి మరియు మూడవ సెమిస్టర్‌ (ఎంసిఎ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి), 5 వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బి, ఐఎంబిఎ 7వ మరియు 9వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశామని ఈ పరీక్షలు మార్చ్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్‌) పరీక్షలో 10,425 మంది విద్యార్థులకు గాను 9564 మంది హాజరయ్యారని, 861 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు తెలుగు సబ్జెక్ట్‌ పరీక్షలో ఇద్దరు, అరబిక్‌ సబ్జెక్ట్‌లో ఒకరు భీంగల్‌ సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాల …

Read More »

టియులో యోగా తరగతులు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లోని సమావేశ మందిరం లో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్‌ చాన్స్‌ లర్‌ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …

Read More »

ఆర్ట్స్‌ కాలేజీని సందర్శించిన విసి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విభిన్న విభాగాలకు చెందిన తరగతి గదులు, సైన్స్‌ విభాగాలకు చెందిన ల్యాబ్స్‌ సందర్శించారు. విద్యార్థులు ల్యాబ్స్‌ సద్వినియోగం చేసుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. త్వరలో జరిగే సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సైన్స్‌ విద్యార్థులు ల్యాబ్‌లను ఉపయోగించుకొని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »