Tag Archives: dichpally

టీయూలో న్యూ ఇయర్‌ వేడుకలు

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో గల ఎగ్జిక్యూటివ్‌ హాల్‌లో కొత్త సంవత్సర (2022) వేడుకలు నిర్వహించారు. పరిపాలనా భవనం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులందరికి, వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని శుభాలు కలగాలని కోరుకున్నారు. సిబ్బంది …

Read More »

వసతి గృహాలు సందర్శించిన వీసీ

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర పాత, కొత్త వసతి గృహాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ శుక్రవారం ఉదయం సందర్శించారు. సంక్రాంతి సెలవులకు ఈ నెల 8 నుంచి 16 వరకు హాస్టల్స్‌ మూసి వేస్తున్న సందర్భంలో వీసీ వెళ్లారు. హాస్టల్స్‌లో గదులను, ఇతర సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్స్‌లో కొన్ని అవసరం ఉన్న వాటికి మరమత్తులు చేయించి, పేయింట్‌ వేయించాలని …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న బి.ఎడ్‌. సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 1259 మంది విద్యార్థులు నమోదు కాగా 1217 మంది హాజరు, 42 మంది గైర్హాజరు అయ్యారని ఆమె తెలిపారు. ఏ పరీక్షా …

Read More »

అర్థశాస్త్రంలో ఆకుల శీనివాస్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఆకుల శ్రీనివాస్‌కు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ అవార్డు ప్రకటించారు. అందుకు సంబంధించిన పిహెచ్‌.డి. వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) గురువారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని మినీ సెమినార్‌ హాల్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల సమస్యలు, సమర్ధవంతమైన పరిష్కారాలు అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగ …

Read More »

తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా డా. కె. లావణ్య

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. లావణ్య నియమింపబడ్డారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఆమె 2007 జనవరిలో తెలుగు అధ్యయనశాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో నియమింపబడ్డారు. ఇక విభాగాధిపతిగా వచ్చే రెండు సంవత్సరాలు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో …

Read More »

పీఆర్‌ఓగా డా. త్రివేణి

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. వి. త్రివేణి నియమితులయ్యారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా డా. వి. త్రివేణి అందుకున్నారు. డా. వి. త్రివేణి ఇది వరకు పీఆర్‌ఓగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నారు. అదే విధంగా టీయూ కల్చరల్‌ …

Read More »

తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ సదస్సు విజయవంతం చేయండి

డిచ్‌పల్లి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ప్రొ. లింగమూర్తి, మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌, తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎగ్జిక్యూటివ్‌ హాల్‌లో జరిగిన అర్థశాస్త్ర అధ్యాపకుల సమన్వయ సమావేశానికి హాజరై సదస్సు నిర్వహణకు దిశానిర్దేశనం చేశారు. ఫిబ్రవరిలో జరిగే రెండు రోజుల సదస్సులో …

Read More »

ఈనెల 10 వరకు రీవాల్యుయేషన్‌ దరఖాస్తులు

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఇటీవల విడుదల అయిన బి.ఎడ్‌. 1వ రెగ్యులర్‌, 1వ, 3వ థియరీ పరీక్షలకు సంబందించిన రివ్యాల్యూషన్‌, రీకౌంటింగ్‌ సంబందించిన అప్లికేష్లను ఈనెల 10వ తేదీ లోపు విద్యార్థులు వారి కళాశాలలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను లేదా పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ …

Read More »

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక..

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇటీవల విడుదల అయిన యుజి 3వ, 4వ రెగులర్‌ థియరీ పరీక్షలకు సంబందించిన రివ్యాల్యూషన్‌, రీకౌంటింగ్‌ సంబందించిన అప్లికేషన్లను విద్యార్థులు వారి కళాశాలలో ఈనెల 10వ తేదీలోపు అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు.

Read More »

సావిత్రిబాయి పూలె విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్‌ డైరెక్టర్‌ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »