Tag Archives: dichpally

మహిళ శక్తి అపారమైంది

డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల శక్తి అపారమైందని, విద్యార్థులందరు తమ జీవితంలో చక్కని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా ఉన్నతమైన విజయాలు సాధించాలని లాభిశెట్టి మహేష్‌ కుమార్‌ అభిలషించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. అపర్ణ వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌ వెబినార్‌ ‘‘శక్తి సామర్థ్యాల అన్వేషణ’’ అనే అంశంపై శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ఇంపాక్ట్‌ …

Read More »

పివైఎల్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు

డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతి శీల యువజన సంఘం పివైఎల్‌ యువనోద్యమ నాయకుడు జిల్లా తొలి కన్వీనర్‌ కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ 30 స్మారక వర్ధంతి సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామంలో జనవరి 30, 31 తేదీల్లో రెండురోజుల పాటు జిల్లా స్థాయి క్యారం, చెస్‌, షటిల్‌, సైక్లింగ్‌, బీడీ కార్మికులకు బీడీలు చుట్టుట వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్టు …

Read More »

రాంపూర్‌లో సిసి కెమెరాల ఏర్పాటు …

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం 18వ తేదీ నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం వారి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌పూర్‌ గ్రామ ప్రజలు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్‌ కళా బృందం పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఆవశ్యకత వివరిస్తూ ఒక్క సీసీ కెమెరా …

Read More »

పలువురు అధ్యాపకులకు పాలనా పదవుల బాధ్యతలు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పలువురు అధ్యాపకులు పాలనా పరమైన బాధ్యతలలో నియామకం పొందారు. వైస్‌ చాన్స్‌లర్‌ చాంబర్‌ లో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా మంగళవారం అధ్యాపకులు నియామక పత్రాలను పొందారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. …

Read More »

గుండెపోటుతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో గల మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విభాగంలో గత 13 సంవత్సరాలుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) గా బాధ్యతలు అందిస్తున్న డా. వి. లక్ష్మణ్‌ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. డా. వి. లక్ష్మణ్‌ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య …

Read More »

డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు పి.డి.ఎఫ్‌. సీటు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఎం.బి.ఎ. పూర్వ విద్యార్థి, పూర్వ పరిశోధకుడు డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ ఆఫ్‌ రీసర్చ్‌ (ఐసిఎస్‌ఎస్‌ఆర్‌) సంస్థలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెల్లోగా ప్రవేశం లభించింది. ఎం.బి.ఎ. విభాగపు ప్రొఫెసర్‌ డా. కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో ‘‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌, ఫైనాన్సింగ్‌, డివిడెంట్‌ డిసిషన్‌ ఆన్‌ ద …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా డా. రవీందర్‌ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) కో ఆర్డినేటర్‌గా అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. కె. రవీందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ నియామక ఉత్తర్వును జారీ …

Read More »

ఎం.ఎడ్‌. పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌ కళాశాలకు చెందిన ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగవలసి ఉండగా కోవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదనంతరం ప్రకటిస్తామని ఆమె అన్నారు. కావున ఈ …

Read More »

17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల అనుసారం తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 17 నుంచి 30 వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. విద్యా సంవత్సరానికి అవరోధం కలుగకుండా సెలవుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు.

Read More »

ఐసిఎస్‌ఐతో టీయూ కామర్స్‌ ఎం.ఒ.యు.

డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగం, ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా మెమొరండం ఆఫ్‌ అండర్‌ స్టాండిరగ్‌ (ఎంఒయు) ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగాధిపతి డా. రాంబాబు గోపిసెట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐసిఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎం.ఒ.యు. కుదుర్చుకున్నారు. ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా సదరన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »