Tag Archives: Hyderabad

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2021-22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు …

Read More »

25న ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ జ్యోతిబా పూలె బిసి సంక్షేమ గురుకుల కళాశాల (టిఎస్‌ఎంజెబిసి) ఇంటర్‌, డిగ్రీ కోర్సులలో ప్రవేశ పరీక్ష ఈ నెల 25 న ఉదయం 10 గంటలనుండి 12.30 వరకు నిర్వహించబడునని, దీనికి సంబందించిన హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. తప్పని సరిగా మాస్క్‌ ధరించి …

Read More »

21న అల్పపీడనం, మరో రెండు రోజులు వర్షాలే

హైదరాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది. అల్పపీడనం వాయవ్య బంగాళా ఖాతం నుంచి దాని పరసర ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతం మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉపరితల అవర్తనం ఏర్పడిరది. ఇది సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు …

Read More »

రాగల 72 గంటల్లో అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాగల 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో …

Read More »

సాగునీటి శాఖలో 700 పోస్టులు

హైదరాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. …

Read More »

ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించండి

హైదరాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్‌ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. …

Read More »

20 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు…

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగు (చివరి) విడతల జేఈఈ మెయిన్‌ పరీక్షల కొత్త తేదీలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడిరచింది. రెండు విడతల పరీక్షలూ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు, మే నెలలో నిర్వహించాల్సిన చివరి విడత పరీక్షలను …

Read More »

వంట కార్మికుల నియామకానికి అనుమతి..

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు అందించడం కోసం 2021-22 విద్యా సంవత్సరానికి 54 వేల 201 మంది వంట కార్మికులను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. వారిని పొరుగు సేవల విధానంలో నియమించుకోవాలంటూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో 10 నెలల పాటు వారిని విధుల్లోకి తీసుకోవచ్చు. ప్రత్యక్ష తరగతులు జరిగితేనే …

Read More »

కేటీఆర్‌ను కలిసిన సోనూసూద్‌

హైదరాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో మంత్రి కె.టి.ఆర్‌ను సోనూసూద్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్‌ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత …

Read More »

ఆన్‌లైన్‌ మెమోలతో ప్రవేశాలు పొందొచ్చు

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ మెమో ఆఫ్‌ మార్క్స్‌ (షార్ట్‌ మెమో) ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందొచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రంగుల్లో మెమోలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రాలను తర్వాత పంపిస్తామని ఆయన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »