Tag Archives: Hyderabad

రవీంద్రభారతి పునఃప్రారంభం

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్‌ నెలలో మూసివేసిన రవీంద్రభారతి ఆడిటోరియంను గురువారం (జూలై 1) న పునఃప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్క ృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్‌ మార్గదర్శకాలను, నిబంధనలను పాటిస్తూ ఇకనుంచి అన్ని సాంస్క ృతిక కార్యక్రమాలను యథావిధిగా …

Read More »

డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని, …

Read More »

ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాలు

హైదరాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడిరచారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిహెచ్‌ఆర్‌డి) లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అద్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. …

Read More »

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ నేపథ్య గాయకుడు

హైదరాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సినీ నేపథ్య గాయకుడు ఆర్‌ పి పట్నాయక్‌ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా పట్నాయక్‌ మాట్లాడుతు కరోనా ముప్పు ఇంకా తొలగి పోలేదని, థర్డ్‌ వేవ్‌ వ్యాప్తి చెందకుండా చూడాలని రాజరాజేశ్వర స్వామిని వేడుకొన్నట్లు తెలిపారు. కరోనా చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం …

Read More »

జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. 2021-22 ఏడాదిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం వెల్లడిరచారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Read More »

కొత్త జిల్లాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో చోటు

హైదరాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాల నుండి హెచ్‌.సీ.ఏ.లో ఆరుగురు సభ్యులను హెచ్‌సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్‌ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సిఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా పలు …

Read More »

కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య

హైదరాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్‌లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్‌ రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, పారామెడికల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. ఈ ఏడాది కొత్తగా …

Read More »

నేతన్నకు చేయూత – పునః ప్రారంభం

హైద‌రాబాద్‌, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమ‌వారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …

Read More »

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ను క‌లిసిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాజ్‌భ‌వ‌న్‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను సీఎం కేసీఆర్ శ‌నివారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి జస్టిస్‌ ఎన్వీ రమణ విచ్చేశారు. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు …

Read More »

జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్‌పై విచారణ జరిపించాలి

హైద‌రాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ జ‌ర్న‌లిస్టుల ఫోరం, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జ‌ర్న‌లిస్టులు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు టిజెఎఫ్‌ అధ్యక్షుడు పల్లె రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టిడ‌బ్ల్యుజెఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శ బసవ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »