నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ సాటర్స్, ట్రై పిల్లర్, క్లర్క్స్ మొదలగు కేటగిరీలకు చెందిన బీడీ కార్మికుల వేతన ఒప్పందం 30.04.2022న ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మంగళవారం 21.06.2022న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుజరాతి …
Read More »11న మహాసభ జయప్రదం చేయాలి
బోధన్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ మాట్లాడుతూ …
Read More »పీఆర్‌సి వేతన పెంపు బకాయిలను విడుదల చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ కార్మికులకు వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ …
Read More »బీడీ యాజమాన్యాలకు డిమాండ్ నోటీసు
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కమిషన్ దారులకు కమిషనరేట్ పెంచాలని డిమాండ్ చేస్తూ బీడీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు బీడీ కమిషన్ దారుల యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో డిమాండ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా బీడీ కమిషన్ దారుల యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.సాయినాథ్, టీ.నర్సయ్య లు మాట్లాడారు. బీడీ పరిశ్రమలోని కమీషన్ ఏజెంట్ల కమిషన్ రేటు పెంపుదల అగ్రిమెంటు …
Read More »కరువు భత్యం అమలుకై ఉద్యమించండి
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన కరువు భత్యం అమలుకై పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. వనమాల కృష్ణ మాట్లాడుతూ 1994లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2021 జనవరి నుండి డిసెంబర్ 2021 వరకు వినిమయ ధరల పెరుగుదల సూచి 1548 పాయింట్ల …
Read More »సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
నిజామాబాద్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌లను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా, కార్మిక, రైతు …
Read More »పెంచిన వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర …
Read More »అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో, డీఈవో కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేసినారని, కానీ అకౌంటెంట్‌లకు …
Read More »కల్లా కపటం లేని నాయకురాలు కామ్రేడ్ వినోద
బోధన్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని దేవిగల్లీలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్ వినోద ప్రథమ వర్ధంతి నిర్వహించారు. సభలో జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ కామ్రేడ్ వినోద కల్లాకపటం లేని మనిషి అని కొనియాడారు. ఆమె ఇంటికి ఎవరు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడేదని, ప్రేమతో పలకరించేదని అన్నారు. కామ్రేడ్ వినోద మహిళలు ఎదుర్కొంటున్న …
Read More »బోధన్ ఆర్‌డివో కార్యాలయం ముందు ధర్నా
బోధన్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవో నెంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని, పప్పుల సురేష్ కుటుంబ ఆత్మహత్యలకు కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐ. ఎఫ్. టీ. యూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »