నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల …
Read More »ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం: 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో రేపటి ఛలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర …
Read More »బోధన్ ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిల పక్షాల ధర్నా
బోధన్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 20, 30 సంవత్సరాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలకు ప్రభుత్వం పట్టా పాస్ బుక్కులు ఇవ్వకపోవడంతో …
Read More »దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన
బోధన్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల …
Read More »బంద్‌కు భవన నిర్మాణ కార్మికుల మద్దతు
బోధన్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27న జరిగే భారత్ బంద్‌కు తెలంగాణ ప్రగతి శీల భవన నిర్మాణ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు నిచ్చి బంద్‌లో పాల్గొంటారని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేసే చట్టాలనే కాకుండా కార్మికులను కట్టు బానిసలుగా …
Read More »సమానపనికి సమానవేతనం కావాలి
బోధన్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ దేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడ్‌లను తెచ్చారని వీటి రద్దుకై ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో 20 తేదీన లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారని, శనివారం బోధన్ పట్టణంలో …
Read More »20న ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ ల రద్దుకై ఐఎఫ్‌టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈనెల 20న కార్మిక శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కోటగల్లిలో ఎన్‌ఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలోని …
Read More »13 ఛలో కలెక్టరేట్
బోధన్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు, వారికి పీఆర్‌సీ తరహా నిర్ణయాత్మక ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన ను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 13 న గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్‌కు పిలుపు నివ్వడం జరిగిందని, దానిలో గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో …
Read More »పీఆర్‌సీ ప్రకారం పెంచిన వేతనాలు ఇవ్వాలి
బోధన్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, పార్ట్ టైం, పుల్ టైం సిబ్బందితో పాటూ స్కీం వర్కర్ల వేతనాలను పెంచిందని, వాటిని మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదని, వెంటనే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోధన్ మున్సిపల్ …
Read More »జీవో నెం. 60 వెంటనే అమలు చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) …
Read More »