Tag Archives: intermediate

10 నుండి మూల్యాంకనం ప్రారంభం..

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 10వ తేదీ నుండి ఇంటర్‌ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్‌ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ జిల్లా విద్య అధికారి కార్యాలయం లోని మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్‌ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. 420 విద్యార్థులు గైర్హాజరు కాగా ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకుని మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేశామని అన్నారు. మొత్తం జిల్లాలో 16,343 మంది విద్యార్థులకు గాను 15,923 …

Read More »

నాసిరకం పదార్థాలు కేటాయిస్తే ఫిర్యాదు చేయాలి…

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల/కళాశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. కళాశాలలోని కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, క్లాస్‌ రూమ్‌ లు, డార్మెటరీ, స్టోర్‌ రూం లను పరిశీలించారు. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, …

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ లో గల నిర్మల హృదయ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష …

Read More »

భయాందోళనలు వీడితే బంగారు భవిష్యత్తు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్కాన్‌ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 3 ఫిబ్రవరి 2025 నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు 48 కేంద్రాలలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు, 5 మార్చి 2025 …

Read More »

సమన్వయంతో ఇంటర్‌ విద్య బోధన జరగాలి..

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్‌ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్‌ జిల్లాకు ఇంటర్‌ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (హైదరాబాద్‌ జిల్లా ఇంటర్‌ విద్య అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌) అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన …

Read More »

డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను తిరిగి చేర్పించాలి…

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ కళాశాల విద్యార్థులు డ్రాప్‌ ఔట్‌ అయిన వారిని గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మధ్యలో కళాశాల మానివేసిన డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను మళ్ళీ తరగతి గదిలో కూర్చోబెట్టలనీ …

Read More »

సిలబస్‌ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్‌ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్‌ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్‌ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …

Read More »

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు దీనిని ఇంటర్‌ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »