Tag Archives: kamareddy

గీత పారిశ్రామిక సహకార సంఘం కమిటీల ఎన్నిక

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గీతా పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి మండల, పట్టణ కమిటీలా కార్యవర్గాలను సోమవారం జిల్లా గౌరవ అధ్యక్షులు మోతే బాలరాజు గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గోపి గౌడ్‌, హరికృష్ణ గౌడ్‌, వెంకట్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ గౌరవ సలహాదారులుగా పోచగౌడ్‌, సీసల నారాగౌడ్‌, అధ్యక్షులుగా ఉప్పల్‌ వాయి గోపిగౌడ్‌, ఉపాధ్యక్షులుగా సేర్ల సాయగౌడ్‌, కోలల …

Read More »

పంట నష్టం వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పంట నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పంట నష్టం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో …

Read More »

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలు డాటా ఎంట్రీ చేయించాలని తెలిపారు.

Read More »

పనిలో మెళకువ, నైపుణ్యంతో మంచి భవిష్యత్తు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :చేసే పనిలో మేలకులు, నైపుణ్యాలు నేర్చుకుంటే కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలో సోమవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. …

Read More »

పంటనష్టం జరిగితే విత్తనాల కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా అన్నారు. బిక్కనూర్‌ రైతు వేదికలో శనివారం అగ్రీ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. …

Read More »

నెలరోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛ సర్వేక్షన్‌ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అన్ని గ్రామ పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్‌ 2023 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్‌ శిక్షణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రహదారి భద్రత నియమాలు పాటించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ఉపయోగించాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తం అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో వనిత (33) అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన బి నెగిటివ్‌ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి ఆ రక్త వర్గం లేకపోవడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేశ్‌ మానవ దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని కె బిఎస్‌ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ …

Read More »

పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటీల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోలు బృందం అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కింద రెండో విడత గొర్రెల కొనుగోలులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు చూడాలన్నారు. లబ్ధిదారులకు …

Read More »

కామారెడ్డిలో భగీరథ జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహర్షి భగీరథ తపస్సు వల్ల ఆకాశం నుంచి గంగ భూమి పైకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహర్షి భగీరథ చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »