కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో ప్రతిరోజు తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ చట్టం 2018 లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ పై మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »కిలిమంజోరా అధిరోహించిన వెన్నెలకు కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించిన బానోతు వెన్నెలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కిలి మంజరో పర్వతాన్ని ఆమె అధిరోహించిందని తెలిపారు. భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని పర్వత అధిరోహిని బానోతు వెన్నెల పేర్కొన్నారు.
Read More »బ్యాంకు లింకేజీ రుణాలు చేపల పెంపకానికి వినియోగించుకోవచ్చు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా రైతులు చేపల పెంపకంపై దృష్టి సారించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం మోడేగామ, భూంపల్లి గ్రామాల్లో మంగళవారం ఫిష్ పాండ్‌లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల నుంచి పదిమంది మహిళా రైతులను ఐకెపి అధికారులు గుర్తించి, …
Read More »ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …
Read More »కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి వాటి జనాభా తగ్గించాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయించి వాటి జనాభాను మున్సిపల్ అధికారులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ అధికారులు పట్టుకున్న పశువులు ఉంచేందుకు ప్రత్యేక …
Read More »ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్నుర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని …
Read More »రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల చోదకులు నిబంధనల ప్రకారం స్పీడులో వెళ్లాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం …
Read More »పరీక్ష ఫీజులు తగ్గించాలి
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అధిక మొత్తంలో పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బాన్సువాడ, ఎల్లారెడ్డి ఇంచార్జ్ దుంపల తుకారం ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్ ఫీజు అంటూ, ప్రాసెసింగ్ ఫీజు అంటూ, బయోమెట్రిక్ ఫీజు …
Read More »అన్ని వసతులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ శివారులోని తాడ్కోల్ వద్ద కెసిఆర్ నగర్ పిఎస్‌ఆర్ కాలనీ’’ ఫేజ్ – 2 లో రూ. 29.41 కోట్లతో నూతనంగా నిర్మించిన 504 డబుల్ బెడ్ రూం ఇళ్ళను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. రూ. 90 లక్షలతో నిర్మించే …
Read More »ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మన ఊరు – మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల, బదిలీల జాబితాలు …
Read More »