కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. …
Read More »అందరికి సముచిత న్యాయం… వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరంగల్‌లో రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత …
Read More »ఈద్గా నిర్మాణ పనులు ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో గల ఈద్గా పనులను 35, 12వ వార్డ్ కౌన్సిలర్లు ప్రారంభించారు. ఈద్గా నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఈద్గా నిర్మాణ పనులను 12, 35 వార్డ్ కౌన్సిలర్‌లు …
Read More »18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు శనివారం, రేపు ఆదివారం తిరిగి డిసెంబర్ 3,4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్‌లో 18 …
Read More »లక్ష్యాలు చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 2022-23 సెప్టెంబర్ అర్ధ సంవత్సర బ్యాంకుల రుణ వితరణ, పనితీరు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2022-23 లో నిర్దేశించుకున్న వార్షిక సంవత్సరంలో రూ.4700 …
Read More »భూంపల్లి పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల
సదాశివనగర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో శుక్రవారం స్థానిక ఎం.పి.పి గైని అనసూయ, స్థానిక సర్పంచ్ లలిత, మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వర్ రావు, స్థానిక సింగల్ విండో చైర్మన్ టి గంగాధర్, గ్రామ ఉపసర్పంచ్ సాయిలు కలిసి 27 వేల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని …
Read More »18 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, …
Read More »నాణ్యమైన ఉత్పత్తుల తయారీ దిశగా జెడ్ ప్రక్రియ
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ రంగంలో జెడ్ సర్టిఫికెట్ కొత్త ఉత్పత్తుల ప్రక్రియ మార్కెటింగ్ విస్తరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఏంఎస్‌ఎంఈ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీస్ బాల్ నగర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గురువారం జీరో డిఫెక్ట్, జీరో ఈఎఫ్ ఫెక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న విజయ (25) నేరెల్ తాండాకి చెందిన గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …
Read More »మధ్యాహ్న భోజనాన్ని అధికారులు పరిశీలించాలి
కామరెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం ఆయన పాఠశాలలకు, వసతి గృహాలకు అందించే ఆహారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు …
Read More »