కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డిలోని ఆర్కే జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు, గోండు జాతి నాయకుడు కొమురం భీం జయంతి నిర్వహించారు. భీం పోరాట పటిమను కొనియాడారు. అనంతరం ఉత్తమ విద్యార్థులను అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల …
Read More »పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. సమాజాన్ని నేర రహితంగా …
Read More »68వ సారి రక్తదానం చేసిన బాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌విఆర్ వైద్యశాలలో పట్టణానికి చెందిన జీవన జ్యోతి (35)కు డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 68వ సారి సకాలంలో …
Read More »సైబర్ నేరాలపై నేడు అవగాహన కార్యక్రమం
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్ నేరగాళ్లం చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రేపు అనగా 21వ తేదీ …
Read More »నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాలను వ్యక్తులు వేలంపాట ద్వారా సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరై మాట్లాడారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు కలెక్టర్ కామారెడ్డి పేరున రూ.10 వేలు …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మి (25) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవికి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా …
Read More »20న కామారెడ్డిలో అవగాహన సదస్సు
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్ షిప్‌లో ఇండ్లు (130), ప్లాట్ల (195) విక్రయానికి సంభందించి ఫ్రీ బెడ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని విజయవంతం చేయాలని …
Read More »ఈనెల 31లోగా బిందు సేద్య సౌకర్యం కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యం సౌకర్యం ఈ నెల 31 లోగా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో బిందు సేద్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుచేసే …
Read More »కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు లు మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత 3 …
Read More »ఓటరు జాబితాలో మార్పునకు దరఖాస్తులు
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు చేయదలచుకున్న వ్యక్తులు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఓటరు నమోదు కొరకు ఫామ్ (6) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బూతు లెవెల్ అధికారుల వద్ద, …
Read More »