Tag Archives: kamareddy

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీ అంగన్వాడి కేంద్రంలో సోమవారం అతి తక్కువ బరువున్న పిల్లలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలకు కొత్తగా వచ్చిన బాలామృతం ప్లస్‌ గురించి తెలిపారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి కార్యకర్తలు తమ చిన్నారులకు పౌష్టికారం అందించే విధంగా అవగాహన …

Read More »

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది , మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. డెంగీ, మలేరియా …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ బాలికల స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో సోమవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్‌ పరిశీలించారు. విద్యార్థులకు వండే బియ్యాన్ని, పప్పులను చూశారు. వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థీనులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. జిల్లా ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

రోడ్లు తక్షణమే మరమ్మతు చేయించాలి

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీ వీల్‌ ట్రాక్టర్లు రోడ్లపై నడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి …

Read More »

కట్ట మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలి

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు …

Read More »

వ్యాధిగ్రస్థుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధ్యమైనంత త్వరగా టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ, కుష్టు, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ సిబ్బంది, లెప్రసి ఎడ్యుకేషన్‌, ఎన్జీవోల జిల్లా సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణ ఓపి ద్వారా క్షయ వ్యాధిగ్రస్థుల గుర్తింపు …

Read More »

ఆగష్టు 1 నుండి పరీక్షలు… ఏర్పాట్లు పూర్తిచేయాలి…

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు …

Read More »

అర్హత గల వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల జంటలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని కోరారు. కాన్పుల మధ్య …

Read More »

భారత సేవాశ్రమ సంఘం ఆద్వర్యంలో ఉచిత నోటుపుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత సేవాశ్రమ సంఘం, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు 11 వేల 500 నోటుబుక్కులు 2 వేల 300 మంది ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయడానికి స్వామి వెంకటేశ్వర నందజి ఉచితంగా అందజేశారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »