Tag Archives: kamareddy

పదిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మాచారెడ్డి విద్యార్థిని సబా తబస్సుమ్‌ అత్యధికం అత్యధిక మార్కులు 581 సాధించినందుకు గాను ఆమె శ్రమను మెచ్చి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కుమార్‌ ప్రత్యేకంగా సన్మానించారు. ఇంతటి ఘనత సాధించినందుకు విద్యార్థినికి …

Read More »

ఉపాధి పనులకు పత్రిపాదనలు సిద్దం చేయాలి…

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్ట నున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, …

Read More »

గురుకుల విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాట వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మైనారిటీ గురుకుల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన పడవ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించిన విద్యార్థులను బుధవారం తన ఛాంబర్‌ లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన …

Read More »

రాళ్ళ వానకి నష్టపోయిన పంటకి పరిహారం చెల్లించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రాత్రి అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కళ్ళల్లో తడిసిన వడ్లను పరిశీలించడానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి బుధవారం అడ్లూర్‌, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో వడ్ల కళ్ళల వద్దకి వెళ్లి రైతులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కానీ వరి, మొక్కజొన్న …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 12.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 8.21 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 2.58 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.38 వరకు తదుపరి వణిజ రాత్రి 1.10 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.06 నుండిదుర్ముహూర్తము : ఉదయం 11.30 …

Read More »

నాణ్యత గల దర్యాప్తు చేయాలి…

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర బీర్కూర్‌, బాన్సువాడ పోలీస్‌ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రికార్డులు, రిసెప్షన్‌, స్టేషన్‌ రైటర్‌, టెక్‌ టీమ్‌, ఎస్‌హెచ్‌ఓ, మెన్‌ రెస్ట్‌రూమ్‌, లాక్‌ అప్‌ రూమ్‌, స్టేషన్‌ పరిసరాలు, పార్కింగ్‌ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు. స్టేషన్‌ సిబ్బంది విధినిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మే.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మఖ సాయంత్రం 6.59 వరకుయోగం : ధృవం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.03 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : ఉదయం 6.33 – 8.12 మరల తెల్లవారుజామున 3.27 – …

Read More »

కామారెడ్డి ప్రజావాణిలో 96 ఫిర్యాదులు

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి లో (96) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని …

Read More »

గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించొద్దు

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు గుర్తింపు లేకున్నా తమ పాఠశాలకు గుర్తింపు ఉందని చెప్పుకుంటూ విద్యార్థులను స్కూల్లో చేర్పించుకుంటున్నారని , విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించే ముందు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఉందని కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య అన్నారు. ఈ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మే.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 11.59 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష సాయంత్రం 6.07 వరకుయోగం : వృద్ధి తెల్లవారుజామున 3.59 వరకుకరణం : బవ ఉదయం 11.59 వరకుతదుపరి బాలువ రాత్రి 12.01 వరకు వర్జ్యం : ఉదయం 6.44 – 8.21దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.21 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »