కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర …
Read More »సోమవారం ప్రజావాణి ఉంది
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయ వచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, రోడ్లు, మునిసిపల్, గ్రామపంచాయతీ, ఆర్టీసీ, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలపై ఫిర్యాదులు …
Read More »జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలి
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పత్రికల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమ …
Read More »క్రీడలతో స్నేహ భావం పెరుగుతుంది
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద కొడప్గల్ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయని చెప్పారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని సూచించారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహ భావం పెరుగుతోందని పేర్కొన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతమైందని …
Read More »జిల్లా కలెక్టర్ శ్రమదానం
కామరెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదవ విడత పల్లె ప్రగతి లో 10,743 కిలోమీటర్ల పొడవు రోడ్లు శుభ్రపరిచారు. మురుగు కాలువలు 1338 కిలోమీటర్ల పొడవు పూడిక మట్టిని తొలగించి శుభ్రం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. 526 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 60,790 మంది ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 2999 …
Read More »పిహెచ్‌సి తనిఖీ
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను చూశారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ అనిల్ కుమార్, సర్పంచ్ సురేష్, వైద్యాధికారి ఆనంద్ యాదవ్, సిబ్బంది …
Read More »పౌష్టికాహారం అందేలా చూడాలి
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో పౌష్టికాహార లోపం లేని చిన్నారులు ఉన్న జిల్లాగా గుర్తింపు తీసుకురావడానికి ఐసిడిఎస్, పోషణ అభియాన్ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం పర్యవేక్షణతో కూడిన అనుబంధ కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్‌వాడి …
Read More »పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసే విధంగా మెప్మా రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని …
Read More »ఆర్ కె కాలేజీలకు షోకాజ్ నోటీసులు
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆర్‌కె గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్‌కు గురువారం ఉదయం షోకాజ్ నోటీసులు ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ జారీ చేశారు. కామారెడ్డిలో గల ఆర్‌కె కళాశాల గ్రూప్‌లో మూడు కళాశాలకు నోటీసులు అందాయన్నారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య బి. విద్యావర్ధిని, సిబ్బంది తనిఖీ చేసి సమర్పించిన నివేదిక …
Read More »పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణం పనులను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read More »