కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతితో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేటలో సోమవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా …
Read More »సంకల్ప బలంతో శ్రమిస్తే సక్సెస్ మీదే
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంకల్ప బలం,పట్టుదల తో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదని ఆత్వ విశ్వాసంతో ప్రిపేర్ అయ్యి …
Read More »కామారెడ్డిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొక్కలను నాటి నీరుపోశారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలోఆర్ అండ్ బి ఎఈ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.
Read More »సోమవారం ప్రజావాణి ఉండదు
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 6న సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. అత్యవసర ఫిర్యాదులు ఉంటే కార్యాలయంలో …
Read More »పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పల్లె ప్రగతి
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వృత్తుల వారికి ఆర్థిక సాయం ఇస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి …
Read More »కామారెడ్డిలో ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ ర్యాలీ సత్య గార్డెన్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేపట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గంగపుత్ర ఎంప్లాయిస్ …
Read More »రోడ్డు ప్రమాద బాధితునికి రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలోత్ శంకర్ (75) వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం మెదక్ ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సి ఉండగా అక్కడ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి …
Read More »క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జూన్ 5న తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ …
Read More »ఉప్పలవాయిని ఆదర్శ గ్రామంగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయిని జిల్లాలో ఆదర్శ గ్రామం గా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామసభకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి గ్రామంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోని తడి, పొడి చెత్తను డంపింగ్ …
Read More »