Tag Archives: kamareddy

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రహదారి భద్రతా అదనపు డిజిపి సందీప్‌ శాండిల్య సూచించారు. బుధవారం జరిగిన కామారెడ్డి జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలతో పాటు రోడ్డు కండిషన్‌ కూడా బాగా లేకపోవడం కారణాలు అని …

Read More »

సీనియర్‌ న్యాయవాది రామ్‌ రెడ్డి సేవలు అభినందనీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రముఖ సీనియర్‌ న్యాయవాది, భిక్కనూరు వాస్తవ్యులు పెద్ద బచ్చ గారి రాంరెడ్డి సేవలు అభినందనీయమని కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌కు విచ్చేసిన సీనియర్‌ న్యాయవాది రామ్‌ రెడ్డిని బుధవారం కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ రంగారెడ్డి …

Read More »

మనిషిగా పుట్టినందుకు పదిమందికి మంచి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రమలోనీ ప్రభుత్వ వైద్యశాలలో స్వాతి (23) గర్భిణీకి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో బ్లడ్‌ బ్యాంకులో రక్తం లేకపోవడంతో వారి బంధువులు జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి మట్టే శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు …

Read More »

ప్రతి నెల కేంద్రాలను పరిశీలించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను సక్రమంగా యాప్‌ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్‌, వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించాలని సూచించారు. ప్రతి నెల …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధుడికి రక్తదానం…

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి చెందిన బుచ్చయ్య (60) వృద్ధునికి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో సరంపల్లి గ్రామానికి చెందిన రాజు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. 2007లో …

Read More »

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మత్తుపదార్థాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. …

Read More »

మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్‌ను

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్దగల అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదని కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం నుండి మార్చాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కెసిఆర్‌కు …

Read More »

రాజీవ్‌ స్వగృహ సహాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రాజీవ్‌ స్వగృహలోని గృహాలను, ఫ్లాట్లను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫార్మేషన్‌ రోడ్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసి నిజామాబాద్‌ జోన్‌ డిప్యూటీ …

Read More »

జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందాలు పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రం భవనాలు, అంగన్‌వాడి భవనాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు. మంగళవారం ఉదయం …

Read More »

స్టేడియంను పరిశీలించిన కలెక్టర్‌

కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. గదిలో ఉన్న క్రీడా పరికరాలను పరిశీలించారు. వీటిని క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి దామోదర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు ఉన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »