కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. గదిలో ఉన్న క్రీడా పరికరాలను పరిశీలించారు. వీటిని క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి దామోదర్ రెడ్డి, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు ఉన్నారు.
Read More »సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుంది
కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా …
Read More »జిల్లా కలెక్టర్ రక్తదానం చేశారు…
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడ్వాయి మండలం సంగోజివాడిలో శనివారం వసంతపంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు …
Read More »పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో …
Read More »బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కానారేెన్స్ హాల్‌లో శుక్రవారం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థినిలకు ఉపకార వేతనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కెనరా బ్యాంక్ విద్యా జ్యోతి పథకం కింద ఉత్తమ విద్యార్థినీలకు ఉపకార …
Read More »నిస్వార్ధ సేవకులే రక్తదాతలు
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కాట్రియాల్‌కు చెందిన లాస్య (28) కు ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లాలో లభించకపోవడంతో వారి బంధువులు విద్యార్థి అండ్ యువజన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు వేణుగోపాల …
Read More »ప్రభుత్వ విప్‌ను కలిసిన జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తిరాం, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవరెడ్డి, సెక్రటరీ రఘుకుమార్, డివిజన్ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా కరస్పాండెట్ పీవీ నర్సింహం, వైస్ చైర్మన్ లక్ష్మణ్, డివిజన్ సెక్రటరీ జమిల్, కామారెడ్డి మండల చైర్మన్ నితీష్ …
Read More »కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మానంద రెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మినుకురి బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అదేశాలు మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి మాజీ ప్రతిపక్ష నేత సమన్వయం కమిటీ తెలంగాణ కన్వీనర్ మహ్మద్ షబ్బీర్ అలీ చుక్కాపూర్ గ్రామానికి చెందిన మినుకురి బ్రమనందరెడ్డికి మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా నియమించి నియమాక పత్రాన్ని అందజేశారు. …
Read More »5 లోగా అకౌంట్లు ఓపెన్ చేయాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 5 లోగా దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లను తీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జూమ్ మీటింగ్ ద్వారా మండల స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు లబ్ధిదారుల పేరిట దళిత బందు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. లబ్ధిదారుల లిస్టు తీసుకుని …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం తీసుకున్న కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రూపాయలు 20 వేలు చెల్లించి ప్యాట్రన్ సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్న గారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తీరామ్, ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »