కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రాజీవ్ స్వగృహలోని గృహాలను, ఖాళీ స్థలాలను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, తహసీల్దార్ …
Read More »ఈవీఎం గోదాములు సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలోని ఈవీఎం గోదామును గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.
Read More »కోర్టు సముదాయాలను సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయమును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత గురువారం సందర్శించారు. కామారెడ్డిలో పోక్సో కోర్టు ఏర్పాటు విషయమై భవనాలను పరిశీలించారు. కామారెడ్డి కోర్టులలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదటగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా …
Read More »కామారెడ్డిలో బీజేపీ భీం దీక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డా. బిఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ముందుగల అంబేెడ్కర్ విగ్రహం దగ్గర ‘‘బిజెపి భీం దీక్ష’’ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »అవార్డుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం…
కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా జల వనరుల అభివృద్ది సంస్థ, హైదరాబాద్ వారు జల వనరుల సంరక్షణ మరియ వివిధ నీటి యాజమాన్య పద్దతులు పాటిస్తూ జల వనరుల అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు, విజయాలు, అవగాహన, ప్రేరణ తదితర కార్యక్రమాలు చేపడుతున్న ఈ క్రింది క్యాటగిరి, విభాగాల నుండి అవార్డులకై దరఖస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ …
Read More »కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చింది…
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చిందని ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్‌లో విద్య, …
Read More »సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామరెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 15 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 19 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1120 మందికి 7 కోట్ల 24 లక్షల 16 వేల 800 రూపాయల …
Read More »అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారు
కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారని డిఆర్‌డివో పిడి వెంకట మాధవరావు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గణాంక అధికారిణి మహిజదేవి స్వచ్ఛంద పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 33 ఏళ్ల పాటు ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకే ప్రజలకు సేవ చేసే …
Read More »గ్రామీణ రోడ్డు మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్డు మరమ్మత్తులకు 7 కోట్ల 6 లక్షల 70వేల రూపాయలు మంజూరైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిక్నూర్ మండలం జంగంపల్లి బిటి రోడ్ 24 లక్షలు, బస్వాపూర్ ఎస్సి వాడ 57 లక్షలు, చాకలి వాడ 22 లక్షలు, బిక్నూర్ నుండి సిద్దిరామేశ్వర టెంపుల్ …
Read More »రాజీవ్ స్వగృహలో వసతులు కల్పించాలి
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాజీవ్ స్వగృహలో విద్యుత్తు, తాగునీరు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. బిటి రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. …
Read More »