Tag Archives: kamareddy

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయాలి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 42 వ వార్డులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. అర్హులందరికీ క్షేత్రస్థాయిలోనే వ్యాక్సినేషన్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకాలు వేయించుకోవాలని కోరారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయాలని పేర్కొన్నారు. కరోనా …

Read More »

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎంకె ముజీబ్‌ ఉద్దీన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ముజీబ్‌ ఉద్దీన్‌ మాట్లాడుతూ న్యాయవాదులకు, తగినంత సహకారం అందిస్తానని హామీ …

Read More »

రేపటి ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 31న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి , కేసులు పెరుగుతున్న దృష్ట్యా 31న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి …

Read More »

అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధం

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో నూతన పాలకవర్గం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి పనుల విషయంలో, అవినీతి విషయంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, తేదీ, సమయం, స్థలం అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పాలని బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరి శ్రీకాంత్‌ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలక …

Read More »

మార్కెట్‌ సముదాయం పనులు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి గాంధీ గంజిలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ సముదాయం పనులను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, తహసీల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, గుత్తేదారు మధుసూదన్‌ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఈవిఎం భవనం ప్రారంభించిన అధికారులు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎం భవనంను ఆదివారం చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈవీఎం, వివి ప్యాట్ల్‌ను ఈ భవనంలో భద్రపరుచుకోవచ్చునని సూచించారు. అంతకుముందు ఆయనకు జిల్లా అధికారులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా …

Read More »

రాజీవ్‌ స్వగ ృహ ప్లాట్లకు హద్దులు నిర్ధారణ

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అడ్లూర్‌ గ్రామ శివారులో గల రాజీవ్‌ స్వగృహ పథకానికి సంబంధించిన ప్లాట్లకు హద్దులు గుర్తించామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఆదివారం రాజీవ్‌ స్వగృహ పథకం ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. గృహాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని అధికారులకు సూచించారు. ప్లాట్లకు నెంబర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

కామారెడ్డి జిల్లా జెఆర్‌సి, వైఆర్‌సి కోఆర్డినేటర్‌గా బాలు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ కో ఆర్డినేటర్‌గా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు, సేవాతత్పరతను గుర్తించి బాలును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 65 సార్లు, కరోనా సమయంలో 980 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను, రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్లకు పైగా రక్తాన్ని …

Read More »

బృహత్‌ పల్లె ప్రకృతి వనాలలో వంద శాతం మొక్కలు నాటాలి

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కళ్ళాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఏపీఓ, ఈసి, సాంకేతిక సహాయకులు ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు చొప్పున రైతు కళ్ళాలను నిర్మించే …

Read More »

సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వామ్యం చేయాలి…

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. జిల్లాలో రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. పేద ప్రజలకు సేవలు అందించడంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »