కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు. రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి …
Read More »అర్హులైన అందరికి తప్పకుండా వ్యాక్సినేషన్ చేయాలి
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకునే విధంగా చూడాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు …
Read More »రెండు రోజుల్లో పనులు పూర్తిచేయాలి…
కామరెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం గోదాం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి ఎఈ రవితేజకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని కోరారు. ప్రతి ప్లాటుకు క్రమ సంఖ్య కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »బీబీపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్‌గా నాగేశ్వర్
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్‌గా ఎన్నికైన బాశెట్టి నాగేశ్వర్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాగేశ్వర్‌ను అభినందించి సన్మానించారు. మండలంలో రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబొద్దిన్, జిల్లా …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా దోమకొండ ఇన్చార్జ్ తహసిల్దార్ శాంత ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. దోమకొండ మండల అధ్యక్షునిగా బుర్రి రవికుమార్ (దొమకోండ), ఉపాధ్యక్షులుగా ముదాం శంకర్ పటేల్ (సితారాంపూర్), సభ్యులుగా సాప శ్రీనివాస్ (సంఘమెశ్వర్), అంకత్ …
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు పనులను పూర్తిచేయాలని కోరారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read More »గోదాము నిర్మాణ పనులు 30 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇవిఎం గోదాం నిర్మాణం పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ కు సూచించారు.
Read More »నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వటం లేదని ఖమ్మంలో బయ్యారంకు చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ (25) రైలు కింద పడి రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ముమ్మాటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యయే అని టీయన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడని, తన చావుకు …
Read More »ప్రగతి సాధించడానికి సమష్టిగా కృషిచేయాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కొవిడ్ నిబంధనలు …
Read More »