Tag Archives: kamareddy

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి 44 కు ఇరువైపుల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 10 వ తేది వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అటవి, మున్సిపల్‌, పంచాయతీ అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి టీ …

Read More »

అందరి సహకారంతోనే పల్లె ప్రగతి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తులు శ్రమదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్లను పరిశుభ్రంగా …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలో స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమీపంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద పూర్వ నామం ‘నరేంద్ర …

Read More »

పల్లె ప్రగతి ద్వారా మౌలిక వసతులు కల్పించాలి…

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులను పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులకు సూచించారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండ, లింగుపల్లి, అంచనూర్‌, బీబీపేట మండలం జనగామ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జంగంపల్లిలో …

Read More »

అధికారుల బదిలీ…

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, జూబ్లీహిల్స్‌ కార్యాలయానికి బదిలీపై వెళ్లడం జరిగింది. ఎస్‌.ఎస్‌.నగర్‌లో తహసిల్దార్‌ గా పనిచేస్తున్న రవీందర్‌ కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌గా బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్‌ అదనపు కలెక్టర్‌ బి.వెంకట మాధవ …

Read More »

పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ది ఫలాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం ఆయన సదాశివనగర్‌, భూంపల్లి, పద్మాజివాడి, తిరుమన్‌పల్లి, ఉప్పల్‌వాయి, రామారెడ్డి, గర్గుల్‌ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. భూంపల్లి, సదాశివనగర్‌లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. సదాశివనగర్‌ పల్లె ప్రకృతి వనంలో బెంచీలు …

Read More »

గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కొరెల్లి గంగమణి (35) జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న పత్తి రవికుమార్‌ ఏ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …

Read More »

ఎవరికి ఇష్టమైన మొక్కలు వారికి ఇవ్వండి…

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గత మూడు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి బాన్సువాడ మండలం …

Read More »

భాస్కరులవ్వండి

భరతమాత బిడ్డలారభాస్కరులయి ప్రకాశించిప్రపంచాన భరతఖ్యాతిప్రభలను వెదజల్లండి వారసత్వ సంపదలగుశాస్త్రంబుల జ్ఞాన మందిదశదిశలా చాటి చెప్పుధర్మమాచరించ లెండి. మహోమహుల చరిత లెరిగిభవిత బాటన్నడవండిమాతృ రుణము దీర్చుకొనగమణి దీపిక లవ్వండి. తనువు మనము లెల్లెడలాత్యాగ నిరతి నమరు కొనగధైర్య సాహసముల తోడధీరులుగా చెలగండి. దేశమే నా దేహమంటుమహా శక్తి నలము కొనుచుదేశ రక్ష జేయ బూనిధన్య జీవులవ్వండి. తిరునగరి గిరిజా గాయత్రి

Read More »

పట్టణ ప్రగతికి ఏర్పాట్లు చేయండి…

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నుండి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులో 100 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. బుధవారం ఆయన సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడుతూ, వార్డులలోని పిచ్చి మొక్కలను, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »