కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత బస్టాండ్, పంచముఖ హనుమాన్ కాలనీల రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, రోడ్ల పక్కన మురుగునీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భవాని నర్సరీని పరిశీలించారు. …
Read More »పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటాలి
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన కలెక్టరేట్ ఆవరణ ముందు భాగంలో మియావాకి విధానంలో మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ ముఖ్య సామాజిక వన విభాగం శాఖ ముఖ్య సంరక్షణ అధికారి రమేష్ డోబ్రియాల్ అన్నారు. కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ఆవరణలో నాటిన మొక్కలను ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తో కలిసి పరిశీలించారు. నూతన కలెక్టరేట్ పక్కన మేడి, జువ్వి, …
Read More »పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, ఎస్పి భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బిజెవైఎంను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కలిసి పని చేయాలని, బూత్ స్థాయిలో బీజేవైఎం కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల అనంత కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశము జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా …
Read More »కామారెడ్డికి నూతన విద్యాసంస్థలు వచ్చేంత వరకు పోరాటం
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, జిల్లా కు మెడికల్ కళాశాల లతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్,ఐటిఐ …
Read More »ఎడ్లకట్ట వాగును పునరుద్దరించండి…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో గల బీబీ పెట్ పెద్ద చెరువు సుమారు 540 ఎకరాల విస్తీర్ణంలో జలకళతో కళకళలాడుతు తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు3500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్ధ్యం గల పెద్ద చెరువు ఎడారిగా మారడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ బీబీ పెట్ మండల నాయకులు ఆందోళన వ్యక్తం …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 20 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 10 లక్షల 53 వేల 100 రూపాయల చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీబీపెట్ మండలం యాడారం గ్రామానికి చెందిన గజ్వేల్లి సందీప్, తుజాల్ …
Read More »కరోనా బాధితునికి ఆక్సీజన్ అందజేత
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శనివారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పడమటి బాపూ రెడ్డి కరోనా వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి, …
Read More »వైద్య కళాశాల పోరాటానికి మద్దతివ్వండి
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్యకళాశాల వస్తే ఈ ప్రాంత విద్యార్థులతో పాటు ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఉచితంగా లభిస్తాయని, మెడికల్ కళాశాల సాధనలో భాగంగా శనివారం టీఎన్ జివో జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్య కళాశాల కోసం చేస్తున్న …
Read More »మెడికల్ కళాశాల సాధనకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల ను కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సాయి రెడ్డి, ఖయ్యుంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల తో …
Read More »