కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాపాలన కార్యక్రమములో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు, మీ ఇంటివద్దకు ఇందిరమ్మ ఇళ్లు సర్వే చేయుటకు గాను సర్వేయర్ మీ ఇంటివద్దకు వచ్చినపుడు ఈ క్రింద తెలిపిన వాటిని తప్పక తమ దగ్గర ఉంచుకొని సర్వేకు సహకరించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో కోరారు. రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) …
Read More »జర్నలిస్టులపై దాడికి నిరసనగా ర్యాలీ
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో సినీ నటుడు మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నాచౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ మోహన్ బాబు ఇంటి ముందు …
Read More »ఇళ్ళ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, భూముల వివరాలు పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, …
Read More »కామారెడ్డి ప్రజలకు గమనిక
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 14 న కామారెడ్డి పట్టణంలోని 14 వ వార్డ్ లో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ ప్రారంభిస్తున్నట్లు ఆయుష్ శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎ.శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని డిస్పెన్సరీ నీ స్థానిక మున్సిపల్ 14వ వార్డ్ లోని ఫ్రీడం ఫైటర్ భవనంలోకి మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఔట్ పేషెంట్ సర్వీస్ …
Read More »గ్రూప్ 2 అభ్యర్థులకు సూచనలు
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15, 16 న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్లు గ్రూప్ 2 పరీక్షలు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.43 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 10.03 వరకుయోగం : వరీయాన్ సాయంత్రం 5.50 వరకుకరణం : వణిజ ఉదయం 11.54 వరకుతదుపరి భద్ర రాత్రి 10.43 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.39 – 6.08దుర్ముహూర్తము : ఉదయం 11.31 …
Read More »బిందుసేద్యం పరికరాలపై వంద శాతం రాయితీ
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సౌజన్యంతో కామారెడ్డి జిల్లాలో రైతులు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని అనంతరం మల్బరీ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి అన్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో మంగళవారం రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మల్బరీ …
Read More »ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. నివారణ చర్యలు చేపట్టిన వివరాలతో పాటు ఫోటో లను …
Read More »గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తూ, జిల్లాలో 19 …
Read More »12వ తేదీలోపు అభ్యంతరాలుంటే తెలపాలి
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. …
Read More »