కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారులు వారి సమస్యలపై రుణమాఫీ, భూ సమస్యలు, తదితర …
Read More »నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల నిధులు
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్ రాజ్ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబర్ 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 2.59 వరకుయోగం : శుక్లం ఉదయం 9.29 వరకుకరణం : భద్ర ఉదయం 7.17 వరకుతదుపరి బవ రాత్రి 7.59 వరకు వర్జ్యం : రాత్రి 11.40 – 1.24 వరకుదుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »పదవ తరగతి అయిన తరువాత ఏం చేస్తారు…?
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత భవిష్యత్తులో అవసరానికి అనువైన విద్యను అభ్యసించాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పదవతరగతి విద్యను అభ్యసిస్తున్న తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులు చదువుతున్న పుస్తకాలను అడిగి …
Read More »అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద …
Read More »బిచ్కుందలో ఐటిఐ ప్రారంభం…
బిచ్కుంద, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఐ.టీ. ఐ. / అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ బిచ్కుందలో ఈ సంవత్సరం నుండి కొత్తగా ప్రారంభిస్తున్న ఆరు ట్రేడ్ లలో అడ్మిషన్ ల భర్తీ అన్ని శాఖల సహకారంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున బిచ్కుంద మండలంలోని ప్రభుత్వ ఐ టి. ఐ. లో నిర్వహిస్తున్న అడ్మిషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. …
Read More »రక్తానికి ప్రత్యామ్నాయం లేదు…
కామరెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశురక్ష వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న రెండు సంవత్సరాల చిన్నారి దీక్షిత (2) కి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం కోసం రక్తనిధి కేంద్రాలలో సంప్రదించినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదని రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను …
Read More »నిర్ణీత గడువు లోగా పనులు పూర్తిచేయాలి…
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షకులతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. …
Read More »ఎల్.ఆర్.ఎస్. సర్వే వేగవంతంగా నిర్వహించాలి
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్.ఆర్.ఎస్. సర్వే పక్కగా, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ వార్డ్ నెంబర్ 1 లోని పలు భూముల ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్. పథకం సర్వే ను మార్గదర్శకాలకు అనుగుణంగా, వేగవంతంగా సర్వే నిర్వహించాలని అన్నారు. రెవిన్యూ, …
Read More »డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను …
Read More »