Tag Archives: kamareddy

లక్ష్యం పూర్తిచేయకపోతే చట్టపరమైన చర్యలు

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దేశించిన లక్ష్యం మేరకు వరి ధాన్యాన్ని సేకరించి 10 శాతం విరిగిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి 2023-24 సీజన్లో సన్నరకం వరి ధాన్యం పొందిన మిల్లర్లతో ఆయన మాట్లాడారు. లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని …

Read More »

గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9న నిర్వహించే గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆయన చీఫ్‌ సూపర్డెంట్లు,బయోమెట్రిక్‌ శిక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బయోమెట్రిక్‌ చేసే విధానంపై అధికారులతో శిక్షణ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనోజ్ఞ (20) కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా …

Read More »

ఈనెల 26లోగా లక్ష్యాలు పూర్తిచేయాలి…

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ 2022 -23 సీజన్‌ కు సంబంధించి లక్ష్యాలను పూర్తి చేయని డిఫాల్టర్‌ రైస్‌ మిల్లుల యజమానులు ఈనెల 26 లోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం లక్ష్యాలు పూర్తి చేయని 35 మంది రైస్‌ మిల్‌ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దిశ నిర్దేశం …

Read More »

పాలీసెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించిన శేషాద్రి

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలంలోని మాలోత్‌ తండా గ్రామానికి చెందిన మాలోత్‌ మోహన్‌ నాయక్‌ కళావతి దంపతుల కుమారుడు మాలోత్‌ శేషాద్రి నాయక్‌ పాలిటెక్నిక్‌ కోర్సు ప్రవేశ పాలిసెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు సాధించారు. పదవ తరగతి ఫలితాల్లోనూ 10/10 జీపీఏ సాధించాడు. మాలోత్‌ శేషాద్రి నాయక్‌ రాష్ట్రస్థాయి 13వ ర్యాంకు సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు.

Read More »

పేద ప్రజలకు అండగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్‌ మండల పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకరయ్య భార్య బాలమణి అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున గ్రామ కాంగ్రెస్‌ నాయకులకు సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం వివరించారు. షబ్బీర్‌ అలీ వెంటనే స్పందించి నిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్‌తో మాట్లాడి బాలమణికి ప్రభుత్వం …

Read More »

జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి…

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు …

Read More »

సమాజ భాగును కోరుకునేదే సాహిత్యం

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గపూర్‌ శిక్షక్‌ …

Read More »

రూ. 645 కోట్లు రైతుల ఖాతాలో జమచేశాము

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నాడు 66 లారీలు సమకూర్చి 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,580 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ తెలిపారు. ప్రస్తుత యాసంగి కొనుగోళ్ళకు సంబంధించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు గత మార్చి 26 న ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా 327, ఐకెపి ద్వారా 23 కొనుగోలు …

Read More »

నీటి సమస్య తీర్చండి సారూ…

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం దేవునిపల్లి రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో వారం రోజులుగా నీరు రాకపోవడంతో మహిళలు, చిన్న పిల్లలు బిందెలు పట్టుకొని వెంచర్ల నుండి నీరు మోసుకుంటున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలలుగా నీటి ఇబ్బంది ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో వాటర్‌ ట్యాంకర్‌ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అధికారులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »